![]() |
![]() |

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షో ఫుల్ ఫన్నీగా సాగింది. ఈ షోకి సీనియర్ నటీనటులు కూడా వచ్చారు. అన్నపూర్ణ, జయలలిత, బాబుమోహన్, శ్రీలక్ష్మి, శివ పార్వతి వచ్చారు. ఇక జయలలితని హోస్ట్ శ్రీముఖి కొన్ని ప్రశ్నలు వేసింది. "ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా..అయ్యో ఈ మూవీ నేను చేయాల్సింది కదా..మిస్ అయ్యిందే అనే లాంటిది ఏదైనా ఉందా" అని అడిగింది. "మయూరి, సప్తపది నేను చేయాల్సిన మూవీస్ అవి మిస్ అయ్యాయి. తర్వాత భరణి గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ మిధునం. నేను భరణి గారు చేద్దామని అనుకున్నాం. కానీ అది ఎలాగెలాగో డైవర్ట్ ఐపోయింది.
అది తర్వాత భరణి గారి డైరెక్షన్ లో బాలసుబ్రమణ్యం గారు, లక్ష్మి గారు చేశారు. ఆ మూవీ చూస్తున్నంత సేపు ఆ లక్ష్మి గారి రోల్ లో నన్ను నేను చూసుకుంటూ ఆనందించిన క్షణాలు ఉన్నాయి, అయ్యో ఈ క్యారెక్టర్ నేను చేయలేపోయానే అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి" అని చెప్పింది జయలలిత. కానీ "ఏదేమైనా మీరు మాత్రం మాకు మీ మూవీస్ ద్వారా ఒక ఎన్సైక్లైపీడియా ఇచ్చారు..థ్యాంక్యూ సో మచ్" అని చెప్పింది శ్రీముఖి. జయలలిత ఒకప్పటి గొప్ప నటి. ఇప్పుడు కూడా మూవీస్ లో అలాగే సీరియల్స్ కూడా నటిస్తోంది. ముఠామేస్త్రి, అప్పుల అప్పారావు, లారీ డ్రైవర్, అగ్గిరాముడు వంటి మూవీస్ లో వ్యాంప్ పాత్రలు చేసిన జయలలిత అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల వచ్చిన ‘భరత్ అనే నేను’లో మేడమ్ స్పీకర్ గా నటించింది జయలలిత. మూడున్నర దశాబ్దాలుగా వందలాది చిత్రాల్లో నటించిన జయలలిత ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నారు. ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌లో ఆర్య తల్లి శారదాదేవిగా నటించింది. అమ్మమ్మ.కామ్, గోరంత దీపం, రాధాగోపాలం, ముత్యాల ముగ్గు వంటి సీరియల్స్‌లో కనిపించింది.
![]() |
![]() |